TV77తెలుగు కే గంగవరం క్రైమ్:
తూర్పు గోదావరి జిల్లా. కే, గంగవరం మండలం పరిధిలో గంగవరం గ్రామానికి చెందిన కర్రీ సత్యనారాయణ కుమారుడు అయినా కర్రీ వీరాంజనేయులు భైరవ స్వామి తమ ఇంటిని ఆఫీసు గా చేసుకుని శ్రీ భక్తాంజనేయ చీటీ పేరున సుమారు 2012 నుండి ఇప్పటివరకు వ్యాపారం సాగించాడు అయితే కరోనా సమయం నుంచి చీటీ వేసిన లబ్ధిదారులకు సోమ్ము సకాలంలో ఇవ్వకుండా కాలం జప్తు చేస్తూ వచ్చాడు దీనిపై సంబంధిత బాధితులు తమ తండ్రిని నిలదీయగా లబ్ధిదారులు అందరికీ తాను న్యాయం చేస్తానని మాట ఇచ్చి గత గత కొంత కాలంగా కనిపించకుండా చాటు అయ్యారు 25 తారీఖున అందరూ వీరాంజనేయులు ఇంటికి వెళ్లగా తన తండ్రి సత్యనారాయణ తమ కుమారుడు ఇంటి నుండి వెళ్ళిపోయాడు . అని చెప్పాడు దీనిపై సత్యనారాయణ నిలదీయగా మరుసటి రోజు బాధితులు అందరిపైనా తిరిగి కంప్లైంట్ పెట్టి పది రూపాయల చొప్పున వడ్డీ కి ఇచ్చి నన్ను బాధిస్తున్నారు. అని తిరగబడ్డారు దీనిపై బాధితులు అందరూ సంబంధిత పామర్రు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా ఎస్ఐ చిరంజీవి సకాలంలో స్పందించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితులందరికీ న్యాయం చేకూరుస్తానని ఎస్సై హామీ ఇచ్చారు. ఈ బాధితులలో కూలీలు .వికలాంగులు తమకు వచ్చే పెన్షన్ డబ్బులతో చీటీలు కట్టి అతని చేతిలో మోసపోయిన మని కన్నీరుమున్నీరవుతున్నారు. దీనిపై అధికారులు ఉన్నతాధికారులు స్పందించి పరారీలో ఉన్న వ్యక్తిని అదుపులోనికి తీసుకుని బాధితులకు న్యాయం చేకూర్చాలని వాపోతున్నారు.