ఇబ్రహీంపట్నం లో 29న నిరసన దీక్ష


 TV77తెలుగు ఇబ్రహీంపట్నం :

జర్నలిస్ట్ హక్కుల సాధనే లక్ష్యంగా....!!!

కరోనా బారిన పడి చనిపోయిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి....!!

ప్రమాద బీమా వర్తింపజేయాలి, పిల్లల స్కూల్  ఫీజు రాయితీ వర్తింపజేయాలి....!!

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికై జర్నలిస్టుల ఐక్య వేదిక నిరసన దీక్ష....!!!

పార్టీలకు అతీతంగా సంఘీభావ మద్దతు ప్రకటించాలని జర్నలిస్టుల తరుపున రాజకీయ నేతలకు విజ్ఞప్తి.....!!

జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా, వర్కింగ్ జర్నలిస్టుల హక్కుల సాధనే ధ్యేయంగా జర్నలిస్టుల ఐక్య వేదిక కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడి చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కొండపల్లి మున్సిపాలిటీ వేదికగా ఒక రోజు నిరసన దీక్ష చేపట్టనున్నారు. జర్నలిస్టుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు పులిగడ్డ సత్యనారాయణ పిలుపు మేరకు కృష్ణాజిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో ఈ నెల 29 న అనగా సోమవారం ఇబ్రహీంపట్నం మండల కార్యాలయం ఎదుట ఒకరోజు దీక్ష నిర్వహించనున్నారు. నిరసన దీక్ష లో ప్రధానంగా కరోనా తో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం విడుదల చేయాలి, నిలిపివేసిన ప్రమాద బీమా పునరుద్ధరించాలి, జర్నలిస్టుల పిల్లలు స్కూల్ ఫీజు రాయితీ వర్తింపజేయాలి, ఇళ్ల స్థలాలు మంజూరు కానీ వారికి ఇంటి స్థలం కేటాయించాలి. ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధిగా పని చేస్తున్న జర్నలిస్టుల కష్టాన్ని గుర్తించి నిర్వహించనున్న నిరసన దీక్ష కు రాజకీయ పార్టీలకు అతీతంగా సంఘీభావ మద్దతు ప్రకటించాలని కోరుతూ.


రిపోర్టర్,సత్య..

జర్నలిస్టుల ఐక్య వేదిక జిల్లా కన్వీనర్.