TV77తెలుగు చింతూరు క్రైమ్:
ముగ్గురు అరెస్టు.
తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు గత ఐదునెలలుగా గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు చాకచక్యమైన చర్యలు చేపట్టి దాదాపు 28 వేల కేజిల గంజాయిని పట్టుకొన్న విషయం అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగా గత నెల రోజులుగా ఏజెన్సీలోని అన్నీ పోలీసు స్టేషన్ల ఎదుట రాత్రి పగలు కూడా వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నారు. తద్వారా కొన్ని రోజులుగా గంజాయి స్మగ్లింగ్ తగ్గినది. అయినప్పటికి గంజాయి తరలించడానికి అనేక మార్గాలను ఎంచుకుంటున్నగంజాయి అక్రమ రవాణా దారులు పైలటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని చెకింగ్ చేసే పోలీసుల కళ్ళ నుండి తప్పించుకోడానికి వేరే వస్తువుల లోడు మధ్య గంజాయి దాచి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. పైలటింగ్ లో భాగంగా వారు మోటార్ సైకిళ్లను మరియు కారులను ఉపయోగిస్తూ పోలీసు వారి కదలికలను ముందుగా గమనిస్తూ సదరు గంజాయి వాహనాలను పోలీసు స్టేషన్ ల పరిధి నుండి దాటవేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టంగా తెలిసింది. ఈ క్రమం లో జిల్లా ఎస్పీ తనిఖీల నిర్వహణ వ్యూహాత్మకం గా చేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. వారి ఆదేశాల ప్రకారం 13-11-2021 తేదీన చింతూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా చింతూరు సబ్-డివిజన్ ఏ.ఎస్.పి. జీ .కృష్ణకాంత్ పర్యవేక్షణలో చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జీ.యువకుమార్, చింతూరు సబ్-ఇన్స్పెక్టర్ బి.యాదగిరి మరియు వారి సిబ్బందితో చేపట్టిన వాహనాల తనిఖీలో మొత్తం 1500 కేజీల గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఈ గంజాయిని అక్రమ రవాణాదారులు ఒరిస్సా రాష్ట్రం మల్కాన్ గిరి ప్రాంతం నుండి కూలీల ద్వారా కాలినడకన సుకుమామిడి ప్రాంతానికి తరలించి, అక్కడ ఒక ఐచర్ వ్యాన్ లో పాత ఫర్నీచర్ లోడ్ కింద గంజాయిని లోడ్ చేసి సుకుమామిడి గ్రామ శివారున గల అటవీ ప్రాంతం నుండి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రములో గల ముజాఫరాబాదుకు తరలిస్తుండగా ముగ్గురు వ్యక్తులతో సహా పట్టుకోవడం జరిగింది. వారిని అరెస్టు అరెస్టు చేయడం జరిగింది. కాగా మరో ముగ్గురు వ్యక్తులు పరారీ లో ఉన్నారు.
అరెస్టు కాబడిన వ్యక్తుల వివరాలు:
గౌరవ్ రాణా, S/o పుష్పిందర్, వ. 23 సం.లు, ఘద్బర గ్రామం, ధోగత్ పోస్టు, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం
నౌశద్ S/o మున్నా, వ. 19 సం.లు, బరనవ గ్రామం, బఘోయత్ పోస్టు, బరనవ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం
ఆరిఫ్ S/o యూసుఫ్, వ. 23 సం.లు, పూథ్ఖస్ గ్రామం, పూర్తి, మీరట్, పూథ్ఖస్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం.
స్వాధీన పరుచుకున్న ప్రోపర్టీ వివరాలు:
1) 1500 KGల గంజాయి, దాని విలువ సుమారు ఒక కోటి యాబై లక్షల రూపాయలు.
2) ఒక ఐచర్ వ్యాన్ Reg.No.UP40T-3355
3) నాలుగు సెల్ ఫోన్లు.
అరెస్టు చేసిన ముద్దాయిలను రిమాండు నిమిత్తం రంపచోడవరం జి ఎఫ్ సి ఎం కోర్టు వారి వద్ద హాజరుపరచడం జరుగుతుంది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రవాణా పై దాడులు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని మరొక్కసారి చెప్పడం జరిగింది. అలాగే ఈ నెట్వర్క్ లో ఉన్నవారందరినీ పట్టుకొని కోర్టు ముందు హాజరుపరచవలసిందిగా చింతూరు ఎ ఎస్పీ మరియు సి ఐ లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. పెద్ద మొత్తంలో గంజాయి రవాణా చేస్తున్న వారిని చాకచక్యంగా పట్టుకున్నచింతూరు ఏ.ఎస్.పి. జి.కృష్ణకాంత్, చింతూరు సర్కిల్-ఇన్స్పెక్టర్ జి.యువకుమార్, చింతూరు సబ్ ఇన్స్పెక్టర్ బి.యాదగిరి మరియు వారి బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయం లో జరిగిన పత్రికా సమావేశం లో జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తో పాటు కుమార్ అడిషనల్ ఎస్.పి.(అడ్మిన్) చింతూరు ఏ.ఎస్.పి. జి.కృష్ణకాంత్, చింతూరు సర్కిల్-ఇన్స్పెక్టర్ జి.యువకుమార్, చింతూరు సబ్ ఇన్స్పెక్టర్ బి.యాదగిరి తదితరులు పాల్గొన్నారు.