వీఆర్వో వేధింపులతో గృహిణి ఆత్మహత్య యత్నం

వీఆర్వో వేధింపులతో గృహిణి ఆత్మహత్య యంత్రం 

 ఆవ వాంబే కాలనీలో వీఆర్వో ఆర్ ఐ ల ఒత్తిడిలు 

 ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు 

 TV77తెలుగు రాజమహేంద్రవరం క్రైo: తాడితోట ఆవ వాంబే కాలనీ లో వేలాదిమంది అనర్హులు, అక్రమ కొనుగోలు దారులను. అక్రమ కట్టడాలను పట్టించుకోలేని సచివాలయ రెవెన్యూ సిబ్బంది, అధికారులు ఒక గృహిణి వేదించడం తో ఆ వేధింపులు భరించలేక పాయిజన్ తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది.16 డివిజన్ ఆవ వాంబే కాలనీ లో బ్లాక్ నెంబర్ 60, గ్రౌండ్ ఫ్లోర్ 7 ఇంటి గృహాన్ని ఇందుకూరి నాగజ్యోతి కి 2017లో ప్రభుత్వం కేటాయించింది. భర్త మృతి చెందడంతో పాటు, ఈమె కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ ఇంటిని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆడపడుచు, బోళ్ళ శ్రీదేవి కి ఆరు లక్షల రూపాయలకు అమ్మేసింది. ఇందుకు సంబంధించి ఇరువురు వంద రూపాయల స్టాంప్ పేపర్ పై లావాదేవీలు జరిగినట్లు, భవిష్యత్తులో వివాదాలకు తావులేకుండా నోటరీ చేయించుకోవడం జరిగిందని బంధువులు ,తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఇటీవల నాగజ్యోతి తన ఇంటిని తనకు ఇచ్చేయాలని ,రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వార్డ్ సచివాలయ వీఆర్వో దుర్గాప్రసాద్, ఆర్ ఐ లు శుక్రవారం ఇంటి వద్దకు వచ్చి ఇల్లు ఖాళీ చేయాలని ,లేదంటే జైలుకు పంపిస్తామని వీఆర్వో దుర్గాప్రసాద్ కేకలు వేసి దుర్భాషలు ఆడారని బాధితురాలు  శ్రీదేవి  కన్నీరుమున్నీరైంది .దాంతో జీవితంపై విరక్తి చెంది మనస్తాపం తో పాయిజన్ తీసుకుని ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నని బాధితురాలు బొల్లా శ్రీదేవి మీడియాతో వాపోయింది. వాంబే గృహాల్లో వేలాదిమంది అసలు యజమానులు కన్నా కొనుగోలుదారులే నివాసం ఉంటున్నారని వారిఅందర్నీ వదిలేసి తననే లక్ష్యంగా చేసుకోవడం వీఆర్వో అమ్ముడుపోయారని బాధితురాలు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా వాంబే గృహాల్లోని అనర్హులను, అక్రమ కొనుగోలుదారులను నియంత్రించాలని . వేధింపులకు గురి చేసిన సచివాలయం వీఆర్వో దుర్గాప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని  తర్వాత తనపై చర్య తీసుకోవాలని బంధువులు, తల్లిదండ్రులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.