విజిలెన్స్ విస్తృత తనిఖీలు
urria 05, 2021
TV77తెలుగు విశాఖ:విశాఖ జిల్లాలో విజిలెన్స్ అదికారులు " పిడిఎస్ " బియ్యం ' అక్రమ రవాణపై ప్రత్యేక తనీఖీలు చేపట్టారు . ఈమేరకు విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అదనపు ఎస్పి జి.స్వరూపరాణి నేతృత్వంలో విజిలెన్స్ అదికారులు విశాఖ జిల్లా నక్కపల్లి మండలం శిరిపల్లి గ్రామంలో ఈస్ట్ గోదావరి జిల్లా కి చెందిన ఎల్లా వీరబాబు అనే వ్యక్తి ప్రభుత్వం సరపర చేస్తున్న "పిడిఎస్ " బియ్యం 11 టన్నుల " పిడిఎస్ " బియ్యన్ని అదికారులు స్వాదీనం చేసుకుని " పిడిఎస్ " బియ్యన్ని అక్కడి పౌర సరపర రాల శాఖ అదికారులకు అప్పగించారు . మూడు రోజుల క్రితం ఎల్లా వీరబాబు విశాఖ ఎస్ రాయవరం వద్ద 20 టన్నుల బియ్యంతో పట్టుబడ్డాడని ప్రస్తుతం అతడిని పొలీసులకు అప్పగించినట్లు విజిలెన్స్ అదికారులు వెళ్లడించారు . ఆరిలావ ప్రాంతంలో టాటా ఏస్స్ వాహనంలో అక్రమంగా ప్రభుత్వం సరపర చేస్తున్న " పిడిఎస్ " బియ్యన్ని విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ సి .ఐ తిరుపతిరావు స్వాదీనం చేసుకున్నారు . ఈమేరకు వాహనంలో తరలిస్తున్న 1200 కేజీలకు సంబందించి 24 బ్యాగులను గుర్తించారు . అక్రమంగా " పిడిఎస్ " బియ్యన్ని తరలిస్తున్న తాడేపల్లి ఈశ్వర్ ను అదుపులోకి తీసుకున్నారు .