TV77తెలుగు కోరుకొండ:
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ లో ఎటువంటి అనుమతులు లేకుండా గోడౌన్లో తయారీకి సిద్ధం చేసుకున్న దీపావళి మందుగుండు సామగ్రిని కోరుకొండ నార్త్ జోన్ పోలీసులు పట్టుకున్నారు.స్థానిక లక్ష్మీనరసింహ స్వామి ఆలయ సమీపంలో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 95 వేలు విలువైన 785 కేజీల దీపావళి మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుని,ముమ్మిడివరపు షణ్ముఖ అనే వ్యక్తి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మండలంలోని ఇదే తరహాలో అనుమతులు లేకుండా తయారీ చేస్తున్నట్లు సమాచారం మేరకు వరుసగా దాడులు చేస్తూ మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని, అనుమతులు లేకుండా ఎవరైన దీపావళి కి బాణా సంచా అమ్మకాలుగాని,తయారీ గాని చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ కడలి వెంకటేశ్వరరావు అన్నారు.