రెండు దేవాలయాల్లో చోరీ


 

 TV77తెలుగు  ప్రకాశం:

 జిల్లా కొమరోలు మండలంలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. అక్క పల్లి గ్రామంలోని రామాలయం గుడి తాళం పగలకొట్టి హుండీలో ఉన్న నగదును దోచుకెళ్లారు అంతేకాకుండా హుండీని తీసుకువెళ్లి స్థానిక పొలాలలో పడవేశారు. ఇదే కొమరోలు మండలం లోని నాగిరెడ్డిపల్లి ఆంజనేయస్వామి గుడి లో కూడా దొంగలు హుండీని ఎత్తుకెళ్లారు. గతంలో కూడా ఈ రెండు దేవాలయాలు పలుమార్లు దొంగలు దొంగతనానికి పాల్పడినట్లు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల పై కఠిన చర్యలు తీసుకొని ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ బ్రహ్మనాయుడు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.