చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ కు డీఐజీ


 


 TV77తెలుగు చిలకలూరిపేట రరూల్ :

 వార్షిక తనిఖీల్లో భాగంగా చిలకలూరిపేట పట్టణం లోని రూరల్ పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని సౌత్ కోస్టల్ జోన్ గుంటూరు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ సీఎం త్రివిక్రమ వర్మ శనివారం సందర్శించారు.ఈ సందర్భంగా డి ఐ జి తో పాటు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని మహిళా పోలీసులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. డీఐజీ ,ఎస్పీ లు పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం రికార్డులు పరిశీలించారు.

ముందుగా డి ఐ జి , ఎస్పీలు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

నరసరావుపేట డీఎస్పీ సిహెచ్ విజయ్ భాస్కరరావు, చిలకలూరిపేట రూరల్ సీఐ సుబ్బారావు,  ఎస్ఐ లు రాజేష్,   మోహన్, చిలకలూరిపేట అర్బన్ సిఐ జి రాజేశ్వరరావు తదితర ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.