TV77తెలుగు నరసరావుపేట:
గుంటూరు జిల్లా ఉన్నతాధికారుల వద్ద నుండి రాబడిన విశ్వసనీయ సమాచారం మేరకు తహసీల్దార్, నరసరావుపేట వారి ఆధ్వర్యంలో పౌరసరఫరాల అధికారులు మరియు రెవెన్యూ అధికారులు కలిసి రావిపాడు గ్రామ శివారు లోని స్వప్న రైస్ ట్రేడర్స్ రైస్ మిల్లును తనిఖీ చేయగా ఆసమయంలో సదరు మిల్లు నందు AP07Y9789 లారీ నందు 50 కేజీల బరువు గల 450 బస్తాల PDS గన్నీ గోతాలలో ఉన్న బియ్యం దిగుమతి చేస్తుండగా పట్టుకొని సదరు లారీని మరియు స్టాక్ సీజ్ చేసి MLS పాయింట్ నందు అప్పగించడమైనది. అదే సమయంలో ఇంకొక లారీ AP16Y8969 నెంబరు గల లారీలో 25 కేజీల బరువు గల 880 బస్తాలు అనగా 220 క్వింటాళ్లు ఎరుపు రంగులో ఉన్న ప్లాస్టిక్ సంచుల్లో ఉన్న బియ్యమును మరియు లారీ ని సీజ్ చేయడం జరిగింది.తదుపరి మిల్లు లో తెలుపు ప్లాస్టిక్ గోతాలలో ఉన్న 50 కేజీల బరువు గల 976 బస్తాలు మరియు 25 కేజీలు బరువు తో ఎరుపు రంగు ప్లాస్టిక్ గోతాలలో ఉన్న 630 బస్తాలు మొత్తం మిల్లు లో ఉన్న 645.50 క్వింటాళ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తంగా 1090.50 క్వింటాళ్లు బియ్యం(సుమారు 41 లక్షల రూపాయల విలువగల) సీజ్ చేయడం జరిగింది.