తెలుగుదేశం పార్టీ నాయకులు గృహనిర్బంధం


 తెలుగుదేశం పార్టీ నాయకులు గృహనిర్బంధం  

 పార్టీ అరాచక పాలన కు ప్రజలు గుణపాఠం చెప్పాలి 


TV77తెలుగు  రాజమహేంద్రవరం రూరల్:


తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిని  నిరసిస్తూ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు  నారా చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు శాసనసభ్యులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి లతో పాటు తెలుగుదేశం నాయకులను కార్యకర్తలను పోలీసులు గృహనిర్బంధం చేశారు.   బొమ్మూరు సి ఐ లక్ష్మణ్ రెడ్డి, ఎస్ ఐ శివాజీ  సిబ్బంది తో  బుధవారం  రాజమహేంద్రవరం రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొమ్మూరు మాజీ సర్పంచ్ ఎం ఎస్ ఎస్ ప్రసాద్ నాయకులను కూడా గృహనిర్బంధం చేశారు.