TV77తెలుగు రాజమహేంద్రవరం:
జాతిపిత మహాత్మా గాంధీ 152వ జయంతిని పురస్కరించుకుని అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆయన చిత్రపటానికి ఫుల మాల వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాదుతూ.స్వాతంత్ర్య సమరయోధునిగా, అహింసావాదిగా దేశాన్ని ప్రభావితం చేసిన మహనీయుడని అన్నారు, మహాత్ముని జీవితం అందరికీ ఆదర్శం, అహింసే ఆయుధంగా బ్రిటిషర్లతో పోరాడిన గొప్ప నాయకుడు, ఆయన ఆలోచన విధానం , త్యాగాలను స్మరించుకుందమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో అడిషనల్ ఎస్పీ (లా & ఆర్డర్) కె. లత మాధురి , అడిషనల్ ఎస్పీ (అడ్మిన్ ) సిహెచ్. పాపారావు , డి.ఎస్.పి లు డి. రామ వర్మ, డి. శ్రీనివాస్ రెడ్డి సి.ఐలు, యస్.ఐలు సిబ్బంది పాల్గొన్నారు.