ఏజెన్సీ ప్రాంత పోలీసులు మరియు భద్రత బలగాలే లక్ష్యంగా “బూబీ ట్రాప్” లను అమర్చిన మావోయిస్టులు
శుక్రవారం మధ్యాహ్నం నిరంతర తనిఖీలలో భాగంగా ఏజెన్సీ ప్రాంతం అయినటువంటి ఆంధ్ర, ఛత్తీస్ఘడ్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న మల్లం పేట గ్రామ అటవీ ప్రాంతంలో చింతూరు ఏ ఎస్ పి, జి.కృష్ణ కాంత్ ఐపీఎస్ నేతృత్వం లో చింతూరు, మరియు ఎటపాక సర్కిల్ ఇన్స్పెక్టర్ ల సంయుక్త ఆధ్వర్యంలో యాంటీ నక్సల్ స్క్వాడ్ మరియు సిఆర్పిఎఫ్ బలగాలు ఏరియా డామినేషన్ లో భాగంగా కూంబింగ్ చేయు సందర్భంలో మావోయిస్టులు వారి యొక్క వ్యూహాత్మక దాడులలో ఒకటి గా భావించే 10 బూబి ట్రాప్ లను అమర్చడం అయినది. వీటిని కూంబింగ్ సందర్భంగా భద్రతా బలగాలు గుర్తించడం జరిగింది. భూమిలో లో పది అడుగుల లోతు వరకు కందకాలను త్రవ్వి దానిలో వెదురు బొంగుల ను బాణాల మాదిరిగా సూది మొనలవలె చెక్కి మరియు ఆకులు అలముల తో కప్పబడి ఉండి కూంబింగ్ కు వచ్చే భద్రత బలగాలని వాటిలో చిక్కుకుని వెదురు బొంగుల బాణాలు గుచ్చుకునే విధముగా ఏర్పాటు చేయడం గుర్తించినారు. మావోయిస్టులు వ్యూహాత్మక యుద్ధ తంత్రంలో భాగంగా భద్రతా బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసి వాటిలో చిక్కుకుని పోలీస్ బలగాలకు అపార నష్టం కలిగించే విధంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బూబీ ట్రాప్ లను కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలు గుర్తించి ధ్వంసం చేయడం జరిగినది.