అర్హత ఉన్న వారందరికీ పెన్షన్లు.
అవ్వా,తాతల మోములలో చిరునవ్వు చిందించడమే జగనన్న లక్ష్యం..
నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న
జక్కంపూడి రాజా.
TV77తెలుగు కోరుకొండ:
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారని రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు.ముందుగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు గాంధీ జయంతి పురస్కరించుకొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం నాడు రాజానగరం ఎం.డి.ఓ కార్యాలయం నందు రాజానగరం, కోరుకొండ మండలాలకు సంబంధించి నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు ఆయన చేతుల మీదగా అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రి వంటి మహనీయుల జయంతి రోజున లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
దేశ నాయకులైన గాంధీ గారు మరియు లాల్ బహుదూర్ శాస్త్రి గారిల మహనీయులు త్యాగ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న మెరుగైన జీవితానికి వాళ్లే కారణమన్నారు. ఆ మహనీయుల అడుగు జాడల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నారని ఆయన తెలిపారు.