అనుమతులు లేకుండా వాణిజ్య కాంప్లెక్స్ నిర్మిస్తున్న ప్రభుత్వ డాక్టర్
నిర్లక్ష్యంగా ఉంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి
ప్రజా న్యాయ పోరాట సంఘం నాయకుడు బిక్కవోలు మోషే డిమాండ్
TV77తెలుగు రాజమహేంద్రవరం రూరల్:
రాజమండ్రి రూరల్ మండలం కోలమూరు గ్రామ పంచాయతీ కొంతమూరు గ్రామంలో అక్రమ నిర్మాణాలు యధేచ్చగా జరుగుతూనే ఉన్నాయి. గత కొన్ని ఏళ్లుగా జరుగుతున్న భూకబ్జాలు. అక్రమ నిర్మాణాలను గ్రామస్థాయి నుండి ఉన్నతాధికారులు వరకు పట్టించుకో కపోవడంతో సామాన్యుల నుండి ప్రభుత్వ అధికారుల వరకు అక్రమ నిర్మాణాలను బహిరంగ చేపట్టడం ఆందోళన కలిగిస్తుంది.
ఆక్రమణ దారులకు పంచాయతీ అధికారులు నోటీసులు మీదా నోటీసులు ఇస్తున్నప్పటికీ వాటిని ఖాతారు చెయ్యకుండా ఆక్రమనిర్మాణాలు చేస్తుండడం పై ప్రజలు విమర్శిస్తున్నారు. ఆక్రమణ దారులకు రాజకీయ నాయకులు. ప్రజా ప్రతినిధులు అండగా ఉండడంవల్ల రెచ్చిపోతున్నట్లు గ్రామస్తులు విమర్శిస్తున్నారు. స్థానిక నూకాలమ్మ తల్లి గుడి దగ్గర 409/1B, 409/C, 410 సర్వేనెంబర్ లకు చెందిన 39 సెంట్ల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఒక ప్రభుత్వ డాక్టరు అక్రమ నిర్మాణం చేస్తున్నారని ప్రజా న్యాయ పోరాట సంఘం నాయకుడు బిక్కవోలు మోషే ఆరోపించారు. ఈ అక్రమ నిర్మాణం పై తమ సంఘం సబ్ కలెక్టర్ కు, ఎమ్మార్వో కు, డి ఎల్ పి ఓ, పంచాయతీ కార్యదర్శులకు చాలాసార్లు ఫిర్యాదులు చేశామని అయినా అధికారులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని మోషే విమర్శించారు.
కొంతకాలం క్రితం వరకు నిలిచిపోయిన అక్రమ నిర్మాణం ఇటీవలే మళ్లీ ప్రారంభించారని, ఇంటి ప్లాన్ కు అనుమతులు తీసుకుని కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించడం దారుణమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న అమరేంద్ర చౌదరి, ఈ అక్రమ నిర్మాణాన్ని చేపట్టారని మోషే తెలిపారు. తీసుకున్న ప్లాన్ ఉల్లంఘించి షాపులు నిర్మించడం ప్రభుత్వ డాక్టర్ కు చట్టప్రకారం చెల్లుబాటు కాదని మోషే పేర్కొన్నారు. ఇదే సామాన్యులు ఎవరైనా అక్రమ నిర్మాణం చేపడితే అధికారులు చట్టపరంగా జైలుకు పంపించే వారిని మోషే విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వ డాక్టర్ అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని, లేని ఎడల సంఘం తరఫున త్వరలో పెద్ద ఉద్యమం చేపట్టినట్లు ఆయన హెచ్చరించారు.
మూడు నోటీసులు ఇచ్చాము. సబ్ కలెక్టర్ దృష్టిలో ఉంది కార్యదర్శి హనుమంతరావు వివరణ:
గ్రామంలో అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారికి నోటీసులు ఇచ్చామని ప్రభుత్వ డాక్టరు కు మూడు నోటీసులు ఇచ్చామని కోలమూరు పంచాయతీ కార్యదర్శి హనుమంత రావు తెలిపారు. అక్రమ నిర్మాణాలు పై సబ్ కలెక్టర్ దృష్టిలో ఫిర్యాదులు ఉన్నాయని ఆయన అన్నారు.