TV77తెలుగు రాజమహేంద్రవరం
ఏపీలో గంజాయి సమస్య కొత్తదేమీ కాదని దశాబ్దాల నుంచి ఉన్నదేనని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. మాదకద్రవ్యాల నియంత్రణపై రాజమహేంద్రవరంలో పోలీసు ఉన్నతాధికారులతో డీజీపీ గౌతమ్ సవాంగ్ అత్యవసర సమీక్ష చేపట్టారు. సీఎం జగన్ ఆదేశాలతో నెలపాటు గంజాయి కట్టికి లోతైన అధ్యయనం చేశామన్నారు. ఈ మేరకు ఎన్‌ఐఏ సహకారంతో రానున్న రోజుల్లో గంజాయిపై ఉక్కుపాదం మోపడానికి మరిన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఒడిశా డీజీపీతోనూ సంప్రదింపులు జరిపినట్లు గౌతమ్ సవాంగ్ వెల్లడించారు.