ఫిర్యాదు ఇచ్చిన మహిళపై ఎస్సై లైంగిక వేధింపులు


 

TV77తెలుగు కృష్ణాజిల్లా

భర్త వేధిస్తున్నాడని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మహిళపై సానుభూతి చూపించాల్సిన ఎస్ఐ వేధించటం విమర్శలకు తావిస్తోంది

ఈ ఘటనపై డీజీపీ కార్యాలయంలో బాధితురాలు ఫిర్యాదు చేసింది కృష్ణాజిల్లా కలిదండ ఎస్ ఐ మణికుమార్ పదే పదే స్టేషన్కు పిలుస్తూ సహజీవనం చేయాలని ఒత్తిడి చేస్తున్నారని బాధితురాలు కొక్కిలిగడ్డ లక్ష్మీ పేర్కొంది ఈ నేపథ్యంలో ఎస్ ఐ పై  చర్యలు తీసుకోవాలని కోరుతూ శనివారం మంగళగిరిలోని డిజిపీ కార్యాలయానికి చేరుకొని ఫిర్యాదు చేసేందుకు వచ్చింది ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆమె భర్త పై ఫిర్యాదు చేస్తే ఎస్సై మణికుమార్  తనని స్టేషన్ ఒకరోజు రాత్రంతా స్టేషన్లోనే ఉంచాడని ఆరోపిస్తోంది మీ భర్త వద్దు అంటున్నావు కదా నాతో ఉండు నిన్ను నేను ఏ లోటు లేకుండా చూసుకుంటూ ఉంటా అని పదే పదే ఇబ్బందికి గురి చేస్తున్నారని తెలిపింది. అదేమిటని అడిగితే తనపై కేసు నమోదు చేశారని తెలిపింది. సి ఐ దృష్టికి తీసుకెళ్తే ఎస్సై కి మద్దతుగా మాట్లాడుతున్నారని తెలిపింది. ఆమెకు న్యాయం చేసి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని విన్నవించు ఎందుకు కు డిజిపి ఆఫీసుకు వచ్చానని తెలిపింది. శనివారం కావడంతో తో కార్యాలయానికి సెలవు అని ఫిర్యాదు సేకరించేందుకు సోమవారం రావాలని బాధితురాలిని డీజీపీ కార్యాలయ సిబ్బంది ఆదేశించారు. మీడియాతో ఆమె మాట్లాడటం గమనించిన వారు ఆమెను పిలిపించి ఫిర్యాదు స్వీకరించటం గమనార్హం ఫిర్యాదుపై విచారించి ఎస్సై పై చర్యలు తీసుకుంటామని డిజిపీ కార్యాలయంలో అధికారులు హామీ ఇచ్చారని ఆమె తెలిపింది . ఏది ఏమైనా న్యాయం చేయవలసిన పోలీసులే ఈ విధంగా ప్రవర్తించడం సరైంది కాదని ప్రజలు .మహిళా సంఘాలు,అంటున్నారు.