TV77తెలుగు రాజమండ్రి రూరల్:
స్దానిక 16 వ డివిజన్ లోని వాంబే గృహాల ప్రాంతంలో రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం పర్యటించారు. వాంబే కాలనీలో మహిళలు వారి సమస్యలు యమ్.ఎల్.ఎ గోరంట్ల దృష్టికి తీసుకు వచ్చారు. కాలువలు సరిగా తీయక డ్రెయినేజీలో నీరు చేరి పందులు,దోమల బెడద ఉంటుందని పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు . మంచి నీళ్లు సరిగ్గా రావడం లేదని, టాప్ ఆపరేటర్ సక్రమంగా నీళ్లు విడుదల చేయడం లేదని, నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుందని ఫిర్యాదు చేశారు. వెంటనే గోరంట్ల మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఓం ప్రకాష్ తో మాట్లాడి జె.సి.బి మిషన్ పెట్టి డ్రెయినేజీ లో సిల్ట్ తొలగించి నీరు వెళ్ళె మార్గం చూడాలని కోరారు. వాంబే గృహాల వద్ద ఎక్కువ కుటుంబాలు జీవనం సాగిస్తున్నందున నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ యేయర్ వాసిరెడ్డి రాంబాబు,మాజీ కార్పొరేటర్ కిలపర్తి శ్రీనివాస్ పాల్గొన్నారు.