గుట్కా ప్యాకెట్లు స్వాధీనం


 

TV77తెలుగు అన్నవరం:

తూర్పు గోదావరి జిల్లా ఎస్పి.రవీంద్రనాధ్ బాబు,   ఇచ్చిన నిర్దిష్ట ఆదేశాలకు అనుగుణంగా పెద్దాపురం డిఎస్పీ  శ్రీనివాసరావు  పర్యవేక్షణలో ప్రత్తిపాడు ఇన్చార్జి సర్కిల్ ఇన్స్పెక్టర్  కిషోర్ బాబు  ఆధ్వర్యంలో స్పెషల్ బ్రాంచి వారు నిషేదిత గుట్కా ప్యాకెట్లు అక్రమ రవాణా జరుగుతుందని ఇచ్చిన సమాచారం మేరకు అన్నవరం ఎస్ఐ   ఎస్.రవికుమార్ మంగళవారం ఉదయం సుమారు 09.00 గంటల ప్రాంతంలో అన్నవరం గ్రామ శివారులో హైవే టెంపుల్ దగ్గరలో అన్నవరం ఎస్ఐ  మరియు వారి సిబ్బంది తో వాహనాలను తనిఖీ చేయుచుండగా తుని వైపు నుండి కత్తిపూడి వైపు AP37TE4567 నంబరు గల  ఐచర్ వేన్ వచ్చుచూ పోలీసు వారిని చూసి వేన్ ను ఆపి డ్రైవరు వేన్ కేబిన్ లో ఉన్న మరో ముగ్గురు ఆసాములు పారిపోవుటకు ప్రయత్నించగా వారిని పట్టుకొని వారిని విచారించగా సదరు వేన్ లో నిషేదిత గుట్కా ప్యాకెట్లు ఐన మీరజ్- 48 బస్తాల్లో 100800 పేకెట్స్, రాజఖైనీ - 10 బస్తాలలో 40000 పేకెట్స్  మరియు గుడ్ ఫ్రెండ్స్ 180 డీలక్స్ విస్కీ బాటిల్స్ 10 ను వేన్ లో లోడ్ చేసి వాటిపై  ఖాళీ చేపలు ట్రేలు పెట్టి గుట్టుగా రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది.