దళితులపై దాడులు అరికట్టాలి


 ప్రైవేట్ శ్రీకరం చేస్తే ఊరుకునేది లేదు అంటున్న

జై భీమ్ కార్యకర్తలు

 దళితులపై దాడులు అరికట్టాలి, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలి

మాల మహానాడు డిమాండ్


TV77తెలుగు రాజమహేంద్రవరం:

దేశంలో రాష్ట్రంలో దళితులపై దాడులు అత్యాచారాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయని వెంటనే వీటిని అరికట్టాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను

మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఎం. కె. భీమారావు డిమాండ్ చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించడం ఉందని ఈ క్రమంలో ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ మేరకు పార్లమెంటులో శాసనం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం దళితులకు హక్కులుగా వస్తున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోందని దళితులకే ఏర్పరచిన వేల కోట్ల నిధులను దారి మళ్ళిస్తుంది  విమర్శించారు. తక్షణం గత ప్రభుత్వాలు అమలు చేసిన శాశ్వత పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు, పి. రాధాకృష్ణ, డి.వరప్రసాద్, అరె రాము, ఉల్లంగి నవీన్, లక్ష్మణు, శివ, శీను ఇతరులు పాల్గొన్నారు.