శ్రీరంగపట్నం లో అభివృద్ధిని. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోని పాలకవర్గం


 శ్రీరంగపట్నం లో అభివృద్ధిని. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోని పాలకవర్గం


ఊరంతా చెత్తకుప్పలు, మురికి కూపాల మయం


హామీలకే పరిమితమవుతున్న ప్రజా ప్రతినిధులు, అధికారులు


 TV77తెలుగు  కోరుకొండ:

తూర్పుగోదావరి జిల్లా . రాజనగరం నియోజవర్గం, కోరుకొండ మండలం లోని  శ్రీరంగపట్నం గ్రామం గత మూడు దశాబ్దాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోక పాలకవర్గాల నిర్లక్ష్యానికి గురవుతోంది. సుమారు 7 వేల మంది   జనాభాతో మేజర్ పంచాయతీ గా  స్థానిక పన్నుల రూపేణా ఆదాయం తో పాటు , కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల  నిధులు సమృద్ధిగా అందుతున్న ప్పటికి గ్రామ అభివృద్ధికి, ముఖ్యంగా బలహీన వర్గాల కాలనీల అభివృద్ధికి, ఆయా వర్గాల సంక్షేమానికి ఖర్చు చేసింది  లేదని గ్రామస్థుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఎన్నికలప్పుడు హామీలు, వాగ్దానాలు ఇస్తున్న ప్రజాప్రతినిధులు తీరా ఎన్నికల అనంతరం ప్రజలను పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

 ఇటీవల వచ్చిన వరదలకు  శ్రీరంగపట్నం దుఃఖదాయిని గా పేరుపడిన కొండ కాలువ బి సి, ఎస్సీ కాలనీల వాసుల పాలిట నరకంగా మారింది. ఈ రెండు కాలనీలోకి నడుము లోతు వరద నీరు  మురికి నీటితో చేరి ఇళ్ళను  ముంచెత్తిన సంగతి తెలిసిందే.  దాంతో ఇళ్ల ముందు మురికి గుంటలు ఏర్పడి మురికి నీరు చేరి దోమలకి నిలయంగా మారాయిని. ఈ కాలనీల్లో డ్రైనేజీ లేవని స్థానిక మహిళలు వాపోయారు.  స్మశానం, వాటర్ ట్యాంకు వైపు డ్రైనేజీ నిర్మించినప్పటికీ, దానిపై స్లాబులు వేయకపోవడం వల్ల ఇటీవల నలుగురు పిల్లలు జారిపడి తీవ్ర గాయాలపాలైరని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైనేజీకి మురికి నీరు బయటకు పోయే మార్గం ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇళ్ల మధ్యనే  నిలిచిపోతుందని స్థానికులు వాపోయారు. సాక్షాత్తు గ్రామ సచివాలయం ఎదుట చెత్త కుప్పలు పేరుకుపోవడం దుర్గంధం వ్యాపిస్తుందని  పాలకవర్గ పని తీరుపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో అర్హులైన పేదలు  చాలా మంది ఉన్నప్పటికీ ప్రభుత్వ పరంగా రావలసిన ఇళ్ల, పెన్షన్లు అందడం లేదని కొత్తూరుకు చెందిన కాకర లక్ష్మి వాపోయింది. గత 30 సంవత్సరాలుగా కాలనీలో డ్రైనేజీలు లేవని, గోదావరి వాటరు సరఫరా చేస్తామని నాయకులు , అధికారులు హామీలు ఇవ్వడమే తప్ప ఈ రోజు వరకు అమలు చేయలేదని తలారి రమణ అనే గృహిణి వాపోయింది. గత 20 సంవత్సరాలుగా కాలనీలో ఉన్న సమస్యలను అధికారులు. ప్రజా ప్రతినిధులు. పంచాయితీ పాలకవర్గాలు పట్టించుకోవడంలేదని  ఐయ్యకి రమేష్ విమర్శించారు. శ్రీరంగపట్నం కాలువ వరదలకు పొంగి తమ కాలనీ ముంచుతుందని, దోమలు, పాములు సంచరిస్తున్నాయిని, నిత్యం భయం గుప్పిట్లో బతుకుతున్నామని,  ప్రస్తుత పాలకవర్గానికి చాలాసార్లు వినతులు ఇచ్చామనీ, అయినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.  ఎస్సీ కాలనిలోని  ఓపెన్ డ్రైను పై స్లాబులు వేయకపోవడం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానిక మహిళలు వాపోయారు. కాలనీలో  వీధుల్లో డ్రైనేజ్ లు లేవని పాలకవర్గాన్ని అడుగుతున్నప్పటికీ, నిధులు లేవని  తప్పించుకున్నారని, ఈ కాలనీ పట్ల పాలకవర్గం వివక్షత పాటిస్తున్నాదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా శ్రీరంగపట్నం గ్రామానికి దుఃఖదాయిని ఉన్న శ్రీరంగపట్నం కాలవను ఆధునీకరించాలని, ముంపు బారినుండి ఎస్సీ, బీసీ కాలనీలను కాపాడాలని, డ్రైనేజ్ లను నిర్మించాలని, స్లాబులు నిర్మించాలని, గోదావరి మంచి నీటిని  అందించాలని, చెత్త కుప్పలను తొలగించాలని, దుర్గంధం బారినుండి గ్రామస్తులను కాపాడి, ప్రజల ఆరోగ్యానికి, గ్రామ అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.