వానరాల వీరంగం


 ఇబ్రహీంపట్నం రింగ్ సమీపం లోనీ గాంధీ బొమ్మ ఎదురు సందులో  కోతుల స్వైర విహారం..!!!


గుంపులు గుంపులు గా ఒక చోట చేరి మనుషుల పై దాడులు చేస్తున్న కోతి మూకలు...!!


కోతుల నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్న స్థానికులు...!!

 TV77తెలుగు ఇబ్రహీంపట్నం:

ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్డు సమీపం లో ఉన్న గాంధీ బొమ్మ ఎదురు  వీదిలో కోతులు స్వైర విహారం చేస్తున్నాయి. వానర సైన్యం గుంపులు గుంపులుగా చేరి మనుషుల పై దాడులకు తెగబడుతున్నాయి.మందలు గా ఒకచోట చేరి ఇళ్లల్లోకి చొరబడి నాన యాగి చేస్తూ స్థానికుల కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.కోతుల బెడద కారణంగా  ఇళ్లలో నుండి బయటకి రావాలి అంటే స్థానికులు భయపడి పోతున్నారు.ఇటీవల ఒక వ్యక్తి పై దాడి చేసిన కోతులు తీవ్రంగా గాయపరిచాయి.దీంతో స్థానికులు మరింత ఆందోళనకు గురవుతున్నారు.అధికారులు ఇప్పటికైనా స్పందించి కోతుల నివారణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

రిపోర్టర్..  సత్య మైలవరం