నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి


 TV77తెలుగు హైదరాబాద్ క్రైమ్:

హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్‌లో మరో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై కాంతు అనే వ్యక్తి లైంగికదాడికి పాల్పడ్డాడు. చాక్లెట్ ఇప్పిస్తానని నమ్మించి ఇంట్లోకి పిలిచిన కామాంధుడు చి‌న్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. చిన్నారికి రక్తస్రావం కావడంతో గుర్తించిన తల్లి. కామాంధుడిని ప్రశ్నించింది. దీంతో ఎవరికైనా విషయం చెబితే చంపుతానంటూ నిందితుడు బెదిరింపులకు పాల్పడ్డాడు. హిమాయత్ సాగర్‌లో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.