కోర్టు కేసు ఉండగా .. రౌడీయిజం


 

కోర్టు కేసు ఉండగా .. రౌడీయిజం


20 ఏళ్ల క్రితం స్థలం కొన్న స్థలం పై వివాదం 


ఎమ్మెల్యే తమ్ముడు ముఠా వీరంగం


 వాక్ స్వాతంత్రాన్ని అడ్డుకున్న డి.ఎస్.పి ప్రెస్ క్లబ్


TV77 తెలుగు రాజమహేంద్రవరం క్రైమ్:

ఎప్పుడో దశాబ్దాల క్రితం భూములకు ధర లేని కాలంలో కొంత స్థలం పై నేడు ధరలు కోట్ల రూపాయలు కు పెరగడంతో భూ కబ్జాదారులు. రాజకీయ ముఠాలు కనపడడం బాధితులపై దౌర్జన్యాలు దిగడం సర్వ సాధారణం అయిపోయింది. నగరంలో ఇప్పటికే భూకబ్జాలు కోర్టు వివాదాలు నిలయంగా మారిన నేపథ్యంలో మరో ఇటువంటి సంఘటన తొమ్మిదో వార్డు లోని ఏకేసీ కాలేజీ ఎదుట చోటుచేసుకుంది. 1998లో ప్రకాశం నగర్ కోపరేటివ్ సొసైటీ లోని ఎల్ పీ  నెంబర్ 84/87లోని సర్వేనెంబర్, ఆర్ఎస్ 211/2 లోని 311 చదరపు గజాల స్థలాన్ని కడియాల సింహాచలం అనే వ్యక్తికి ( బాధితుడు ) నాయుడు వీర వెంకట సత్య ప్రసాద్ అనే వ్యక్తి 12 లక్షల 44 వేల రూపాయలు అమ్మినట్లు ఇరువర్గాల మధ్య స్టాంప్ పేపర్ లు రాయించుకోవడం జరిగింది. ఈ మొత్తంలో ఏడు లక్షలు ఒకసారి 2000లో మరో 5 లక్షలను బాధితుడు చెల్లించడం జరిగింది మిగిలిన 1.44 లక్షల రూపాయలను బాకీ చెల్లించవలసి ఉంది. ఈ క్రమంలో సత్య ప్రసాద్ కు అమెరికాలో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లి స్థిరపడ్డాడు. గత 20 ఏళ్లుగా ఈ స్థలంలో పలు వ్యాపారాలు చేసుకుంటూ బాధితుడు జీవనోపాధి పొందుతున్నాడు. సత్య ప్రసాద్ కి మేనల్లుడిగా చెప్పుకొనే గుర్రాల వెంకట కృష్ణ అనే వ్యక్తి కొందరు అసాంఘిక శక్తులతో  ఎమ్మెల్యే   తమ్ముడు  ఆగస్ట్ 13న షాపు వద్దకు వచ్చి  అసభ్య పదజాలంతో దూషించి వీరంగం చేశారని బాధితులు  మీడియా వద్ద ఆరోపించారు. ఈ సంఘటనపై ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా తమ వద్ద ఉన్న కాగితములు పరిశీలించి సివిల్ వివాదం గనుక సామరస్యంగా ఇరువర్గాలు పరీక్షించుకోవాలని ప్రెస్ మీట్ లు పెట్టవద్దని ఆదేశించారని బాధితుడు వాపోయాడు. ఈనెల ఏడో తారీఖున మళ్లీ షాపు వద్దకు కొందరు ప్రసంగ శక్తులు  ఫలానా మనుషులు మంటూ తమపై దౌర్జన్యానికి పాల్పడ్డారని స్థలంలోని అక్రమంగా ప్రవేశించి విలువైన వస్తువులను నాశనం చేశారని బాధితుడు కుడుపూడి సింహాచలం వాపోయారు. స్థలం క్రయ విక్రయాలకు సంబంధించి స్థల యజమాని కొనుగోలుదారులు మధ్య వివాదాలు లేవని ఉంటే గనక చట్ట,న్యాయ పరంగా పరిష్కరించు కుంటామని పేర్కొన్నారు. తమ సమస్య చెప్పుకునేందుకు మీడియాకు చెప్పుకునేందుకు ప్రకాష్ నగర్ డి ఎస్ పి, ప్రెస్ క్లబ్ నాయకులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో అధికార పార్టీ అరాచక పాలన సాగిస్తుంది

తెలుగు జనతా పార్టీ జాతీయ  అధ్యక్షుడు పెద్దిo శెట్టి వెంకటేశ్వర రావు ఆగ్రహం

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వాక్ స్వాతంత్రం స్వేచ్ఛాయుత జీవనం ప్రమాదంలో పడ్డాయని. రాష్ట్రంలో అధికార పార్టీ అరాచక పాలన సాగిస్తుందని తెలుగు జనతా పార్టీ  జాతీయ అధ్యక్షుడు పెద్దిo శెట్టి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ వర్గానికి చెందిన బాధితుడికి సంఘీభావంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థల వివాదం ఏదైనా ఉంటే చట్ట న్యాయస్థానం ద్వారా పరిష్కరించుకోవాల్సి ఉందనన్నారు. అయితే అధికార పార్టీ అధికార పార్టీ నాయకులు ఎమ్మెల్యే తమ్ముడు చట్టాన్ని చేతిలోకి తీసుకుని తన చేతుల్లోకి తీసుకుని బాధితుడినీ అసభ్య పదజాలంతో దూషించాడని అసాంఘిక శక్తులతో రౌడీయిజం చేయడం సమంజసం కాదని అన్నారు. రాజమండ్రి, కాకినాడ పలుచోట్ల అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికార మదం తో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు ,ఇదే విధానం కొనసాగినట్లుయితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.