నిబంధనలు ప్రజలకేనా ... పోలీసులకు కాదా


 

పట్టపగలు ఏ ఆర్ గ్రౌండ్లో మందు కొడుతున్న హెడ్ కానిస్టేబుల్


ఎస్పీ ఆదేశాలు సొంత సిబ్బందే బేఖాతర్


TV77తెలుగు  రాజమహేంద్రవరం క్రైమ్:

 చట్టాలు. సెక్షన్లు. రూల్స్. ఇవన్నీ ప్రజల కే కానీ మాకు కాదని ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏమైనా చేస్తాం మమ్మల్ని నిలదీసే వారు ఎవరినే ధీమా నగర పోలీసుల తీరును అద్దంపట్టే ఈ సంఘటన ఇది.


ఇటీవలనే కొత్తగా బాధ్యతలు చేపట్టిన అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే మందుబాబుల పై పోలీసులతో విరగబడి జరిమానాల తో ప్రతాపం చూపిస్తూన్న పోలీసులు  పోలీస్ బాస్(  ఏస్పీ )ఆదేశాలే బేఖాతర్ చేస్తున్న ఈ  దృశ్యం సాక్ష్యం గా నిలుస్తుంది.


నిన్న మొన్న టి వరకు ఏ .ఆర్. గ్రౌండ్స్ గా ఉన్న  స్థలంలో లో సెంట్రల్. సౌత్ మండలాల డీఎస్పీ ల కార్యాలయాలు, దిశా పోలీస్ స్టేషన్, ట్రాఫిక్, క్రైమ్ పోలీస్ స్టేషన్లకు కూత వేటు దూరంలో ఒక హెడ్ కానిస్టేబుల్ పట్టపగలే మందు కొట్టడం పోలీస్ బాస్ ఆదేశాలు బేఖాతర్ చేసిన వైనాన్ని ప్రజలు విమర్శించడం గమనార్హం.



రాత్రి సమయాలలో ఎలా ఉన్నా,  యూనిఫారం వేసుకొని, పట్టపగలు  ఆన్ డ్యూటీ లో మందు కొట్టిన  ఈ హెడ్ కానిస్టేబుల్ పై రూల్స్ వర్తిస్తాయా?  సొంత వాడని  వదిలేస్తారా?