TV77తెలుగు కాకినాడ:
తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా ఎస్సీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారుజాము నుండే జిల్లా వ్యాప్తంగా గుర్తించబడిన నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసు మరియు ఎస్ ఈ బి సిబ్బంది ఆకస్మిక దాడులు చేస్తున్నారు.పెద్దాపురం, కాకినాడ, అమలాపురం రామచంద్రాపురం సబ్ డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి గండేపల్లి, గొల్లప్రోలు, తుని, కొత్తపేట, ఆలమూరు మండలాలలో నాటు సారా తయారు చేస్తున్నటువంటి కేంద్రాలపై దాడులు చేసి నాటు సారా తయారుచేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా నాటుసారా తయారీకి వాడే కొన్ని వేల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, వందల లీటర్ల కాచి వాణా కు సిద్ధం చేసిన సారాను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటితో పాటుగా నాటు సారా తయారీకి ఉపయోగించిన గ్యాస్ సిలిండర్లు, ఐరన్ స్టవ్ లు, అల్యూమినియం పాత్రలు స్వాధీనం చేసుకోవడం జరిగింది.ఈ దాడులలో ప్రత్యేక బృందాలు తయారు కాబడి రవాణాకు సిద్ధంగా ప్లాస్టిక్ టిన్ లలో నింపబడినటువంటి నాటుసారాను అరెస్టు కాబడిన వ్యక్తుల యొక్క ఇళ్ల పరిసర ప్రాంతాల నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది.