ద్విచక్రవాహానాన్ని లారీ డీ, ఇద్దరు మృతి


 TV77తెలుగు  ప్రకాశం :

 జిల్లా చీరాలలో  బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహానాన్ని లారీ డీకొన్నది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను రవిచంద్(20), విల్సన్(18)లుగా గుర్తించారు. వీరిద్దరూ మరియమ్మ పేట, సాయికాలనీ వాసులుగా స్థానికులు గుర్తించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత లారీతో సహా డ్రైవర్ పరారయ్యాడు. ప్రమాదానికి నిద్రమత్తే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో సాయికాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.