TV77తెలుగు ఆత్రేయపురం:
తూర్పుగోదావరి జిల్లా. ఆత్రేయపురం మండలం వద్దిపర్రులో మొసలి హల్ చల్ చేసింది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం స్ధానిక మత్స్యకారులు చేపల కోసం గోదావరి నదిలో వలలు ఏర్పాటు చేయడంతో ఆ వలలో మొసలి చిక్కింది. దీంతో ఆందోళన చెందిన మత్స్యకారులు కొత్తపేట అటవీశాఖ అధికారులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మొసలిని తరలించారు.