మంగళవారం చిత్తూరు జిల్లా, పీలేరు పంచాయతీ కార్యాలయ ఆవరణలో పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి చేతుల మీదుగా కొత్త పింఛన్లు, పంచాయతీ కార్మికులకు నిత్యవసర సరుకులు, ఆటో డ్రైవర్లకు 'ఈశ్రమ' కార్డుల పంపిణీ కార్యక్రమం పీలేరు సర్పంచ్ షేక్ హాబీబ్ భాష ఏర్పాటు చేశారు. సభ ప్రారంభమైన తర్వాత మాట్లాడేదానికి చాలామంది వక్తలకు అవకాశం ఇచ్చారు, కానీ వేదిక పైకి గాని, మాట్లాడేదానికి కానీ ఆటో యూనియన్ నాయకులకు ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదని సర్పంచి షేక్ హాబీబ్ బాష తమను అవమానించారని బహిష్కరించినట్లు ప్రకటించి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా బిస్మిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు బోదేషా వలి మాట్లాడుతూ సర్పంచ్ షేక్ హాబీబ్ బాషా ఆదేశం మేరకు తెల్లవారి ఎనిమిది గంటలకే టిఫిన్ కూడా తినకుండా 'ఈశ్రమ' కార్డుల పంపిణీ ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చామని కార్యక్రమం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన తర్వాత మాట్లాడటానికి చాలా మంది వక్తలకు అవకాశం ఇచ్చి తమకు అవకాశం ఇవ్వలేదని దీంతో ఆటో డ్రైవర్ నాయకులు మనస్తాపం చెందినట్లు తెలిపారు. కాబట్టి ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.ఇంకా కొంతమంది ఆటోడ్రైవర్లు సర్పంచ్ వైకిరి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో పీలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి అలియాస్ కడప గిరి చేతుల మీదుగా 'ఈశ్రమ' కార్డులు ఆటో డ్రైవర్లకు, వారి భార్యలకు పంపిణీ చేయడం జరిగింది. పై కార్యక్రమంలో జిల్లా బిస్మిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు బోదేషా వలి, వై ఎస్ ఆర్ సి పి నాయకులు కే.ఆనంద్, ఆటో యూనియన్ నాయకులు
రహమత్ పీర్, నౌలాక్ భాష,
కోటగుంట శేఖర్, చంగల్ రాయుడు, హాసన్ వలి, ఖాదర్ బాషా, రఫీ, హుస్సేన్, వాహిద్, లాలూ, వెంకటసుబ్బయ్య, వేణుగోపాల్, వెంకటేష్, ఆర్కాట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈశ్రమ కార్డుల పంపిణీ బహిష్కరించిన బిస్మిల్లా ఆటో యూనియన్ నాయకులు
urria 05, 2021
TV77తెలుగు పీలేరు: