ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్ 62 ఎర్రచందనం దుంగలు స్వాధీనం.


 TV77తెలుగు  చిత్తూరు:
 జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా సంబంధించి చిత్తూరు జిల్లా ఎస్ పి  ఎస్ సెంథిల్ కుమార్,  ఆదేశాల మేరకు జాయింట్ డైరెక్టర్,  ఎసిబి వి. విద్యాసాగర్ నాయుడు, స్వీయ పర్యవేక్షణలో ఎర్రచందనం అక్రమ రవాణా పై నిఘా ఉంచి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగినదినది. అందులో భాగంగా 09-10-2021 వ తేదిన రాబడిన పక్కా సమాచారం మేరకు కుప్పం అర్బన్ పి ఎస్  ఇన్స్పెక్టర్ ఏ. సాదిక్ అలీ, కుప్పం ఎస్సై సి. ఉమా మహేశ్వర్ రెడ్డి మరియు స్పెషల్ పార్టి టీమ్ పక్కా ప్రణాళికతో కుప్పం - కృష్ణగిరు హైవే పై నడుమూరు చెక్ పోస్ట్ వద్ద సుమారు 3 గం. ల ప్రాంతంలో వాహనాల తనికి నిర్వహిస్తుండగా అనుమానాస్పదం గా ఉన్న ఒక 12 టైర్ ల లారీ, ఒక స్కార్పియో వాహనాలని పట్టుకొని తనికి చేయగా అందులో 62 ఎర్రచందనం దుంగలు కనుకోనబడినవి. ఈ కేసుకు సంబందబడి కడప జిల్లా కు చెందిన మోస్ట్ వాంటెడ్, అంతర్జాతీయ స్థాయి లో ఎర్రచందనం ను ట్రాన్స్పోర్ట్ చేసే ఎర్రచందనం స్మగ్లర్ వింజమూరు రామనాథరెడ్డి ని అతని అనుచరులు ముగ్గురుని అదుపులో తీసుకోని అరెస్ట్ చేయడం అయినది. స్వాధీనం చేసు కొన్న ఎర్రచందనం దుంగలు మరియు వాహనాల విలువ సుమారు 50 లక్షల వరకు ఉంటుంది. అధికారులు తెలిపారు.