TV77తెలుగు రాజమహేంద్రవరం :
నగరాభివృద్ధి సంస్థ (రుడా) ద్వారా ఉభయ గోదావరి జిల్లాలోని 207 గ్రామాలు అభివృద్ధికి మార్గం సుగమమం అయ్యిందని రుడా చైర్మన్ ఎం షర్మిలారెడ్డి అన్నారు. శనివారం స్థానిక రుడా కార్యాలయంలో రుడా పరిధిలోని భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు ఇతర సర్వీసులు కొరకు ఆన్ లైన్ఎపి డిపిఎంఎస్ వెబ్ పోర్టల్ ను ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకంగా రుడాను ఏర్పాటు చేయడం జరిగిందని రుడా పరిధిలోని గ్రామాలలో భవన మరియు లేఅవుట్ల అనుమతులు కొరకు పడుతున్న యిబ్బందులను గుర్తించి త్వరితగతిన అనుమతులు కొరకు ఆన్‌లైన్ విధాన సేవలు అమలులో తేవడం జరిగిందన్నారు. 17 మండలాల పరిధిలోని ఈ ఆన్ లైన్ సేవలు నేటి నుంచి అమలులోనికి వచ్చాయన్నారు. కొవ్వూరు, నిడదవోలు, పట్టణాలు, రాజమహేంద్రవరం. నగర పాలక సంస్థ పరిధిలో ఈ సేవలు అందుబాటులోనికి రావడం జరిగిందన్నారు. ఎంతో శ్రమించి పైనాన్సియల్, డి.డి. ఓ కోడ్లు,. పి.డి ఎక్కౌంట్లు విదానాలను తీసుకొని రావడం జరిగిందన్నారు. పటిష్టమైన కమిటీని రుడా పరిధిలో నియమించడం జరిగిందన్నారు. ఇటీవల కాలములో 130 దరఖాస్తులకు వారం రోజులలో అనుమతులు మంజూరు చేసి రూ 40 లక్షలు ఆదాయాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. రుడా వైస్ చైర్మన్ మరియు నగర పాలక సంస్థ కమీషనరు ఎం అభిషిక్ కిశోర్ మాట్లాడుతూ పంచాయితీలు అయితే 300 చదరపు మీటర్లు పరిదికిలోబడి భవన నిర్మాణ లేఅవుట్లకి అనుమతులు మంజూరు చేయవచ్చునని, అదేవిధంగా కొవ్వూరు, నిడదవోలు కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయని, నగరాలలో అయితే 1000 చదరపు మీటర్లు పరిదికి లోబడి అనుమతులు జారీచేస్తాయని, 1000 చదరపు మీటర్లు పరిధి దాటితే రుడా పరిధిలోనే అనుమతులు పొందాల్సి వుంటుందన్నారు. లైసెన్సు టెక్నికల్ పర్సన్స్ రూ 10 వేలు డిపాజిట్ తో పాటుగా రూ. 10 వేలు ఫీజు చెల్లించాలని, అదేవిధంగా ప్రతి ఏడాది రెన్యువల్ కొరకు మరో రూ10 వేలు చెల్లించాలన్నారు. బిల్లర్సు లైసెన్సు కొరకు రూ 20 వేలు డిపాజిట్ మరియు రూ 20 వేలు ఫీజు చెల్లించాలని ప్రతి ఏడాది రెన్యువల్ కొరకు రూ 20 వేలు చెల్లించాలన్నారు. లేఅవుట్ల ప్లాన్లు కొరకు జి.ఓ. నెంబరు 119 తేదీ 28.3.2017ను అనుసరించి రుడా పరిధిలో అనుమతులు జారీచేయడం జరుగుతుందన్నారు. భవన అనుమతులు కొరకు జి.ఓ నెంబరు 275, తేదీ 18.7.2017ను అనుసరించి అనుమతులు జారీచేయడం జరుగుతుందన్నారు. భవిష్యత్తులో మూడు రాజధానులు ఏర్పాటు కాబడితే మన రుడా కేంద్ర బిందువుగా తయారు కాబడుతుందన్నారు. పరిపాలన పరంగా అన్ని ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అనుమతులు అనేవి ముందు చూపుతో ఇస్తూ ఎటువంటి విపత్తులు ఎదురైన ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టాలుకు తావులేకుండా ఉండేలా విశాలమైన రోడ్లు, డ్రెయిన్ల వ్యవస్థలుండేలా జాగ్రత్తలు వహించాల్సివుంటుందన్నారు డిపి ఎంఎస్ సాంకేతిక వ్యవస్థలలో టెక్నికల్ సమస్యలు పరిష్కారానికి ఒక (సెల్) వ్యవస్థను స్థానికంగా ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. రుడా పరిధిలోని ప్రజానీకానికి రుడా పరిధిలోని అనుమతులు మంజూరు విధి విదానాల పట్ల ఆన్ లైన్ ప్రక్రియ పట్ల పూర్తి అవగాహన పెంపొందించాలని ఆదేశించారు.