రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్న 16 మోటార్ సైకిళ్ళు, ఒక ఆటోను సీజ్ చేసిన పోలీసులు


TV77తెలుగు రాజమహేంద్రవరం:

రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ  ఐశ్వర్య రస్తోగి, ఉత్తర్వులు మేరకు రాజమహేంద్రవరం పట్టణంలో  హైవే మీద రాంగ్ రూట్ లో ప్రయానించే వారిని గుర్తించి,వాహనాలను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ ఎస్ఐ మహ్మద్ హాబిబ్ బాషా,  ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాఫిక్ డిఎస్పి వరప్రసాద్,  ట్రాఫిక్ సిఐ నాగ మోహన్ రెడ్డి  ఆద్వర్యంలో  మంగళవారం లాలా  చెరువు హైవేపై రాంగ్ రూట్ లో ప్రయాణం చేస్తున్న 16మోటారు సైకిళ్ళు , 1ఆటో సీజ్ చేసినట్లు ట్రాఫిక్ ఎస్ఐ మహ్మద్ హాబిబ్ బాషా తెలిపారు. బొమ్మూరు మరియు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ల పరిధి లో  కేసు నమోదు చేసామన్నారు.