TV77తెలుగు రాజమహేంద్రవరం :
రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయంలో అమరవీరుల స్థూపం వద్ద ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, సర్దార్ వల్లభభాయి పటేల్ 146వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఫూల మాల వేసి ఘన నివాళులర్పించి జాతీయ సమైక్యతకు పాటుపడుదామని ప్రతిజ్ఞ చేసినారు. అనంతరం ఎస్పీ ఆధ్వర్యంలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరులైన పోలీసు అధికారులు, సిబ్బంది వారి గౌరవార్థం రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 60 మంది అర్బన్ జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా విచ్చేసి రక్త దానం చేశారు. ప్రస్తుత కోవిడ్ 19 కష్టకాలంలో ముందుకు వచ్చి వెలకట్టలేని రక్తదానం చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందినకి ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లా&ఆర్డర్ కె.లతా మాధురి, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సిహెచ్ పాపారావు, ఎఅర్ డిఎస్పీ వి.సత్తిరాజు, అర్.ఐలు కె.వి నరసింఘ రావు, పి.సంజీవ్ కుమార్, పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆర్.రఘురాం మరియు సిబ్బంది పాల్గొన్నారు.