TV77తెలుగు రాజమహేంద్రవరం :
ఏలూరు రేంజ్ డీఐజీ కె.వి.మోహన్ రావు అడిషనల్ ఎస్పీ లా,ఆర్డర్ కె. లతా మాధురి తో కలసి 1వ పట్టణ పోలీసు స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసరు. పోలీసు స్టేషన్ పని తీరు, కేసుల దర్యాప్తు, విజిబుల్ పోలీసింగ్, ప్రజాసమస్యలు పరిష్కారం, పిటిషన్ మేనేజ్మెంట్, డయల్ 100 కాల్స్‌పై పోలీసులు సత్వరం స్పందించడం తదితర అంశాలపై పరిశీలన జరిపి సెంట్రల్ జోన్ డిఎస్పీ జె.వి.సంతోష్ తో చర్చించారు.
ఈ తనిఖీలో డీఐజీ మోహన్ రావు మాట్లాడుతూ, స్టేషన్ రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేయాలని తగు సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. అనంతరం స్టేషన్ రిసెప్షన్ కౌంటర్, హెల్ప్ డెస్క్ లను పరిశీలించి, ఫిర్యాదుదారులతో గౌరవంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసు కొని, పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని సి ఐ ను ఆదేశించారు.