ఎంపిపి పదవి మాదిగలకు కేటాయించాలి
జిల్లా అధికార ప్రతినిధి తాడికొండ డిమాండ్
TV77తెలుగు కొయ్యలగూడెం:
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు మొదలయింది పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసి 11 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ఆశయాల కోసం పనిచేసిన సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఈరోజు కనుమరుగైపోయారు మొన్న జరిగిన ఎంపీటీసీ ,జెడ్పీటీసీ కౌంటింగ్ విషయంలో కొయ్యలగూడెం మండలం లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 19 ఎంపీటీసీలు గెలవగా అందులో 5 గురు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు ఈరోజు పార్టీ కోసం కష్ట పడిన వ్యక్తి తమ్మి చ్చి బ్రహ్మయ్య కు ఎంపీపీ పదవి ఇవ్వాలని మండల ఎమ్మార్పీఎస్ నాయకులు అందరూ డిమాండ్ చేశారు ఒకే ఇంట్లో రెండు పదవులు ఎలా కట్ట పెడతారని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆవేదన చెందారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినా శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎంపీపీ పదవి చదువుకున్న వ్యక్తి బ్రహ్మయ్య కు ఇవ్వాలని శ్రీనివాస్ అన్నారు ఈ కార్యక్రమంలో మండల ఎమ్మార్పీఎస్ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.