రోకలిబండతో కొట్టి చంపిన భార్య

TV77తెలుగు బచ్చన్నపేట: చేర్యాల మండలం చుంచనకోటకి చెందిన అశోక్‌కి జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామానికి చెందిన మహిళతో వివాహమైంది. కొద్దిరోజుల కిందట పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగిరాకపోవడంతో ఆమెను తీసుకొచ్చేందుకు అశోక్ కట్కూర్‌లోని అత్తారింటికి వెళ్లాడు. భర్తతో మెట్టినింటికి వెళ్లేందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.ఒకరిపై మరొకరు దూషణలకు దిగడంతో తీవ్ర ఘర్షణకు దారితీసింది.భర్తపై ఆగ్రహంతో రగిలిపోయిన భార్య క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టింది. రోకలి బండ తీసుకుని భర్త తలపై బలంగా కొట్టింది. తీవ్రగాయాలు కావడంతో అశోక్ అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.