ఢిల్లీలో కేసిఆర్ కు స్వాగతం
iraila 01, 2021
TV77తెలుగు ఢిల్లీ :
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. గురువారం ఢిల్లీలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. భూమి పూజ కార్యాక్రమంలో పాల్గొనేందుకు సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలసి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు.ఢిల్లీ చేరుకున్న ఆయనకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఎంపీలు స్వాగతం పలికారు.పార్టీ కార్యాలయ నిర్మాణానికి ఢిల్లీలోని వసంత్ విహారం మెట్రో స్టేషన్ సమీపంలో కేంద్రం 1300 గజాల స్థలాన్ని కేటాయించింది. గురువారం భూమి పూజ చేసి.. ఏడాదిలో నిర్మాణం పూర్తి చేయాలని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.రెండు రోజుల పర్యటన అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్ తిరిగి రానున్నారు.