భార్య అత్త వేధింపులకు తాళలేక భర్త ఆత్మహత్య

TV77తెలుగు గోకవరం: తూ.గో భార్య,అత్త వేదింపులు తాళలేక భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై బుధవారం గోకవరం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. ఎస్ ఐ యువి. శివనాగబాబు, బాధితుడు కుటుంబ సభ్యులు కధనం ప్రకారం. మండలం లోని అచ్చుతాపురం గ్రామానికి చెందిన శొంఠి వీరబాబు(30) కు గోకవరం లోని డ్రైవర్స్ కోలనీకి చెందిన వేకుల బూరయ్య, రామలక్ష్మి దంపతుల ప్రదమ కుమార్తె వేకుల వీరవేణి తో సుమారు 9ఏళ్ళ క్రితం వివాహమైంది. వీరి కి కుమారుడు, కుమార్తె సంతానం. అయితే వివాహం అయి కొంతకాలం గడిచి నప్పటినుంచి భర్త వీరబాబును భార్య ఏదొక విషయంపై తరుచూ గొడవ పడుతుండేది. అత్తతో కలిసి కాపురం చేయనని, తల్లి పేరుమీద ఉన్న కొద్దిపాటి పొలాన్ని తన పేరు మీద రాయించాలని భర్త వీరబాబు తో భార్య వీరవేణి, ఘర్షణకు దిగేది. ఈ విషయంలో వీరవేణి తల్లి రామలక్ష్మి కూడా ఆమెకే మద్దతు తెలిపేది. దీంతో తన తల్లిని వదిలి రావడం కుదరదని, తల్లి పేరుపై ఉన్న ఆస్తి తన సోదరులు కు కూడా దక్కుతుందని భార్యతో వీరబాబు వారించే వాడు. అయినప్పటికీ భార్య వేదింపులు రోజురోజుకూ ఎక్కువవ్వడ0తో ఈనెల 1 వ తేదీన వీరబాబు ఇంట్లోనే భార్య ముందే పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న వీరబాబు కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చివరకు పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఈ నెల 14న వీరబాబు మృతి చెందాడు. జరిగిన సంఘటన పై అందిన పిర్యాదు మేరకు వీరబాబు భార్య వీరవేణి, అత్త రామలక్ష్మి ల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివనాగబాబు తెలిపారు.