చవితి పేరుతో మత రాజకీయాలు వద్దు సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విజ్ఞప్తి

TV77తెలుగు రాజమహేంద్రవరం: రాష్ట్రంలో శాంతియుత ,సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసేందుకు బిజెపి నాయకులు వినాయక చవితి పేరుతో రాష్ట్రంలో మంచి వాతావరణాన్ని చెడగొట్టడం దారుణం అన్నారు.దేశంలో,రాష్ట్రంలో అనేక ప్రజా సమస్యలు ఉన్నా నోరు విప్పని బిజెపి నాయకులు ఇప్పుడు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం మంచిది కాదన్నారు . మీకు నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలన్నారు కరోనా మూడో దశ ప్రమాదం పొంచి ఉన్న ఈ పరిస్థితుల్లో కరోనా నియమ నిబంధనలు జాగ్రత్తగా పాటించి ప్రజలు వినాయక చవితి జరుపుకోవాలని మధు కోరారు రాష్ట్రంలో కరోనా విజృంభించి నప్పుడు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి ఎటువంటి సహాయం చేయలేదన్నారు రాష్ట్రం కోరిన మేరకు టీకాలు ఇవ్వకుండా వివక్షతను చూపుతుందని విమర్శించారు .కేంద్ర ప్రభుత్వం పండుగ సీజన్లో తీసుకోవలసిన చర్యలపై రాష్ట్రానికి ఇచ్చిన ఆదేశాలను సైతం గురించి విస్మరించి బిజెపి నాయకత్వం ప్రజల విశ్వాసాలతో రాజకీయ కుతంత్రం నడుపుతుంది అని అన్నారు.జిల్లా ప్రజానీకం బిజెపి ఆడుతున్న నాటకాలను గమనించి సామరస్య వాతావరణాన్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని మధు ఒక ప్రకటనలో తెలియజేశారు