సంబంధిత అధికారులతో కలిసి రోడ్ల మరమ్మతుల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజా
iraila 24, 2021
TV77తెలుగు రాజనగరం:
కాతేరు-సీతానగరం రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తేవాలని రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా సంబంధిత ఆర్.అండ్.బి అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నాడు సీతానగరం మండలంలోని కాటవరం, ముగ్గళ్ళ,జాలిముడి తదితర ప్రాంతాల్లో సంబంధిత అధికారులతో కలిసి రోడ్ల వైడింగ్ పనులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 70 కోట్ల రూపాయల వ్యయంతో కాతేరు - సీతానగరం రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టడతున్నామని,నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ రోడ్ల నిర్మాణ పనులు చేస్తున్నామన్నారు. అందులోభాగంగానే సంబంధిత అధికారులతో కలిసి జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగిందన్నారు.బొబ్బిల్లంక గ్రామంలో చేపడుతున్న డ్రైయిన్ల నిర్మాణ పనులను పరిశీలించారు.అధికారులందరూ సమన్వయంతో రోడ్ల నిర్మాణ పనుల విషయంలో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాలని నాణ్యత విషయంలో రాజీ పడకుండా ముందుకు వెళ్లాలన్నారు.ఏటువంటి సమస్యలు తలెత్తినా తన దృష్టికి తీసుకువచ్చి సత్వరమే పరిష్కరించుకోవాలని సంబంధిత అధికారులను ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ సూరెడ్డి, డి.ఈ మధుసూదన్ రావు,బొబ్బిలంక చౌదరి, పిచ్చుకల రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.