ఎంపిటిసి ఎన్నికల్లో చారిత్రక విజయం నమోదు చేసిన జనసేన అభ్యర్థి పోలిశెట్టి తేజ

విప్లవాత్మక రాజకీయాలకు నాంది....!!! 

 ఓటుకు నోటు లేకుండా మైలవరం రాజకీయాలలో గెలుపుకు పడిన ఏకైక పునాది...!!! 

 అర్ధశతాబ్దపు నోటు బ్యాంక్ రాజకీయాలలో సువర్ణ అధ్యాయం...!!! 

TV77తెలుగు   మైలవరం :
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రాబల్యం. ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వెల్లువ.. అంతకు మించి మైలవరం రాజకీయాల్లో ఎమ్మెల్యే వసంత సృష్టిస్తున్న విజయాల సునామీ. ఇవన్నీ దాటుకొని నిలిచింది ఒక విప్లవాత్మక పతాకం.అదే జనసేన జెండా. మైలవరం నియోజకవర్గ పరిధిలో ఏకపక్షంగా జరిగిన ఎంపిటిసి , జడ్పీటిసి ఎన్నికల్లో వైసీపీ విజయ ఢంకా బజాయించి రికార్డ్ విజయాలు నమోదు చేసింది. మైలవరం లో ఉన్న 73 స్థానాల్లో 69 స్థానాలు కైవసం చేసుకునీ ప్రత్యర్ధులను కోలుకోలేని దెబ్బ కొట్టింది. అయితే ఈ ఎన్నికల్లో 3 స్థానాలు టిడిపి గెలవగా, ఒక స్థానం మాత్రం జనసేన గెలుచుకుంది. ఇప్పుడు ఇదే జిల్లా వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఓటుకు నోటు అన్నట్లు నడుస్తున్న ప్రస్తుత రాజకీయాలలో అసలు ఎలాంటి ధన ప్రవాహం లేకుండా కేవలం అభ్యర్థి నిబద్దత , ఆ అభ్యర్థి వెనక ఉన్న జెండా చూసి ప్రజలు పట్టం కట్టడం రాజకీయ వర్గాల్లో చర్చ నీయంశం అయ్యింది. లక్షలు ఖర్చు పెట్టినా దొరకని విజయం దక్కడం తో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు అర్ధశతాబ్దపు రాజకీయ చరిత్ర లో ఓటు కు నోటు లేకుండా రాజకీయాలు చేయలేని పరిస్థితుల్లో ఇలాంటి నోటు రహిత గెలుపును పరిశీలిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఇది ఒక విప్లవాత్మక గెలుపు గా, ప్రజా చైతన్య విజయంగా భావిస్తున్నారు.. మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలం లో తుమ్మలపాలెం గ్రామం నుండి జనసేన పార్టీ తరుపున ఎంపిటిసి అభ్యర్థిగా బరిలోకి దిగిన పోలిశెట్టి తేజ వైసీపీ అభ్యర్థిపై గెలిచారు. మైలవరం నియోజకవర్గం లో ఈ విజయం నోటు రహిత రాజకీయాలకు ఒక పునాదిగా భావిస్తున్నారు. ఎంపిటిసి విజయం పై రాజకీయ విశ్లేషణ.. 
  సత్య.... 
రిపోర్టర్ మైలవరం