స్పందన అర్జీలను గడువులోగా పరిష్కరించాలి కమిషనర్ అభిషిక్ కిశోర్

TV77తెలుగు రాజమహేంద్రవరం: స్పందన అర్జీల పై స్పందించే తీరు క్రియాత్మకంగా వుండి నిబంధనలకు అనుగుణంగా గడువులోగా పరిష్కరించాలని నగర పాలక సంస్థకమీషనరు ఎం అభిషిక్ కిశోర్ అధికారులను ఆదేశించారు.సోమవారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో సుమారు 15 మంది అర్ధిదారులు తమ సమస్యలను వ్రాత పూర్వకంగా కమీషనరువారికి సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర పౌరులు తమకు సామాజిక భద్రత పించన్లు పునపరుద్ధరించాలని గృహాలు మంజూరు చేయాలని వివిధ రకాలు సమస్యలకు తగు పరిష్కార మార్గాలు చూపాలని కోరారన్నారు. ఈ కార్యక్రమంలో అదరపు కమీషనరు ఎన్ వివి సత్యనారాయణ, డిప్యూటీ కమీషనరు సాంబశివరావు. సి.పి సూరజ్ కుమార్,ఎస్.ఇ ఓం ప్రకాష్ ఎంహెచ్ఓ ఎ వినూత్న వివిధ విభాగాల అధిపతులు తదితరులు పాల్గొన్నారు.