జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాని పరిశీలించిన అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి

TV77తెలుగు రాజమహేంద్రవరం రూరల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు గతంలో జరిగిన జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలు కౌంటింగ్ కొరకు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి యొక్క ఆదేశాల మేరకు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, నేషనల్ అకాడమీ అఫ్ కన్స్ట్రక్షన్, ధవళేశ్వరం వద్ద ఏర్పాటు చేయబడిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ కౌంటింగ్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి పోలీస్ అధికారులకు పలు సూచనలు ఆయన తెలియచేసినారు.తేది.19.09.2021న ఉదయం 8.00 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమగును.ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతున్న సందర్భంగా ఎటువంటి ఆటంకాలు మరియు అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా సజావుగా సాగేందుకు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతు కౌంటింగ్ జరిగే ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున ఐదుగురు లేదా అంతకుమించి ఎక్కువ మంది గుమిగూడరాదని, కౌంటింగ్ కేంద్రాలకు ఒక కిలోమీటార్ పరిధిలో వ్యక్తులు కర్రలు, ఇతర మారణాయుధాలతో తిరగరాదని, కౌంటింగ్ ప్రక్రియకు హాజరయ్యే అభ్యర్దులు తప్పనిసరిగా కోవిడ్ నియమ నిబంధనలు పాటించాలని, సెక్షన్-30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం అభ్యర్ధులు, ఆయా పార్టీల నాయకులు మరియు వారి అనుచరులు ఎవరూ కూడా విజయోత్సవ సభలు గానీ, ఊరేగింపులు గానీ బాణాసంచా కాల్చుట గానీ చేయరాదని, పోలీస్ వారు విధించిన ఆంక్షలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవటం జరుగుతుందని, అలాగే కౌంటింగ్‌ విధులకు హాజరుకానున్న టీచర్లు, రెవెన్యూ, పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు కరోనా నిబంధనల్ని పాటిస్తూ కౌంటింగ్‌ ప్రక్రియ నిర్వహించెలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కౌంటింగ్ సెంటర్ వద్ద పటిష్ట మైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసుకోవాలని పోలీస్ అధికారులకు తాగు సూచనలు ఇవ్యడం జరిగింది.