ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు సజావుగా పూర్తయ్యేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు అర్బన్ జిల్లా ఎస్పీ
iraila 18, 2021
TV77తెలుగు రాజమహేంద్రవరం రూరల్:
అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి సబ్ కలెక్టర్ ఇలాక్కియా, మరియు మున్సిపల్ కమిషనర్ అభిషిక్త కిషోర్,తో కలిసి ది.19.09.2021వ తేదీన రాజమహేంద్రవరం డివిజన్ మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జరుగు NAC బిల్డింగ్, ధవలేశ్వరంను స్వయంగా పరిశీలించినారు. ఈ సందర్భంగా వారు ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, సంబంధిత అధికారులకు తగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. రాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉన్నందున జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని, శానిటేషన్ చర్యలు తీసుకోవాలని ఆదేశించినారు. కౌంటింగ్ విధులకు హాజరుకానున్న టీచర్లు, పోలీసులు, ఇతర ఉద్యోగుల కరోనా నిబంధనల్ని పాటిస్తూ, కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించాలని. ఓట్ల లెక్కింపునకు వచ్చు కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ ఏజెంట్లు పాస్‌లు తప్పక ధరించాలని. ఎస్పీ గారు పోలీస్ అధికారులతో మాట్లాడుతూ.కౌంటింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున ప్రజలు గుమిగూడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు అలాగే నేషనల్ హైవే పై వెళ్ళు వాహనాలకు ఎలాంటి అంతరాయం కలుగకుండా పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించడం జరిగింది.