బట్టలను దొంగలించిన ఇద్దరు పోలీసులు సస్పెండ్

TV77తెలుగు చిత్తూరు: ఫుట్‌పాత్ పై బట్టల దుకాణంలో బట్టలను దొంగలించిన ఇద్దరు పోలీసులు సస్పెండ్ అయ్యారు.ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో ఏఆర్ ఎస్సై మహమ్మద్ బాషా, ఏఆర్ కానిస్టేబుల్ ఇంతియాజ్‌ ఉన్నారు.చిత్తూరులో కలక్టరేట్‌కు వెళ్లే రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై కొందరు వ్యాపారులు బట్టలు విక్రయించేవారు. అయితే,రాత్రి సమయంలో దుస్తులను మూటగట్టి ఒమిని వ్యాన్‌లో ఉంచి వెళ్లారు.ఉదయం వచ్చేసరికి కొన్ని దుస్తులు చోరీకి గురైనట్లు సదరు వ్యాపారి గుర్తించాడు.వెంటనే సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.ఇద్దరు పోలీసులు ఆ బట్టలను దొంగిలించినట్లుగా స్పష్టమైంది. దాంతో బాధిత వ్యాపారి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు.ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.విచారణలో సదరు పోలీసులే బట్టలు దొంగిలించినట్లు నిరూపితమైంది.దాంతో జిల్లా పోలీసు యంత్రాంగం వారిని సస్పెండ్ చేసింది. బట్టల దుకాణంలో దుస్తులు చోరీ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.