ఎట్టకేలకు సమంత రూమర్స్ పై నోరు విప్పింది


నాగచైతన్యతో విడాకులు తీసుకొంటుందని, హైదరాబాద్ నుంచి ముంబైకి మకాం మారుస్తోందని వార్తలు హల్చల్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో చాలామంది ఇప్పటికే విడాకులు కూడా జరిగినట్లు చెప్తుండగా.. తాజాగా ఆమె ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు.

ఈ  నేపథ్యంలో ఒక అభిమాని “‘మీరు నిజంగా ముంబైకి వెళ్తున్నారా.?’ అంటూ ప్రశ్నించారు. ఇక ఈ ప్రశ్నకు సామ్ సమాధానం చెప్తూ ” నేను ఎక్కడికి వెళ్లడం లేదు.. హైదరాబాద్ లోనే ఉంటాను.. హైదరాబాద్ నాకు అన్ని ఇచ్చింది.. ఇదే నా ఇల్లు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ పుకార్లు ఎక్కడ, ఎలా మోదలయ్యాయో తనకే తెలియదని, కానీ అవన్నీ కూడా పుకార్లే అని చెప్పుకొచ్చింది