వాన పడితే వరదే చినుకు పడితే చిత్తడే

వాన పడితే..వరదే..!! చినుకు పడితే చిత్తడే...!!! 

 సరైన మురుగునీటి వ్యవస్థ లేదు.... సరైన రోడ్లు లేవు.. మౌలిక వసతుల కల్పనకు ఆమడ దూరంలో.....!!!

 ప్రాణాంతక వ్యాధుల బారిన పడి పసి మొగ్గలు బలైపోతున్నా సరే ప్రభుత్వం లో చలనం మాత్రం శూన్యం...!! 

గతంలో మెదడు వాపు తో ఒక బాలుడు మృతి..నేడు డెంగీ తో మరో యువతి పరిస్థితి విషమం....!!! 
TV77తెలుగు ఇబ్రహీంపట్నం:
 గడిచిన 30 ఏళ్లలో ఎన్నో కుటుంబాలు అక్కడ స్థిర నివాసం ఉన్నప్పటికీ అభివృద్ధి లో మాత్రం ఆమడ దూరంలో ఉంది.కాలనీ తరహాలో ఏర్పడి స్థిర నివాసాలు ఏర్పరుచుకుని జీవనం సాగిస్తున్న అనేక కుటుంబాలు మౌలిక వసతుల కల్పనకు మాత్రం నోచుకోవడం లేదు. ఇబ్రహీంపట్నం డాక్టర్ జాకీర్ హుస్సేన్ కళాశాల కు వెళ్ళే మార్గం లో ఉన్న ఒక కాలనీ పరిస్థితి ఇది.ఏళ్ల తరబడి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉన్నా సరే ఆ ప్రాంత అభివృద్ధి పై ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ఇప్పటికీ వరకు ఆ ప్రాంతం లో సరైన మురుగునీటి వ్యవస్థ కానీ సరైన రోడ్లు కానీ లేవు. మురుగు నీరు పోయే మార్గం లేక ఆ ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొటున్న పరిస్థితి.తెలీక పాటి వర్షం పడితే ఆ ప్రాంతం లో నీటి ప్రవాహం వరదలను తలపిస్తుంది. మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవడం తో ఎక్కడి మురుగు అక్కడే నిలవ ఉంటోంది . ఫలితంగా ఆ ప్రాంత వాసుల ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఒక 6 ఏళ్ల బాలుడు మెదడు వాపు తో మృత్యువాత పడగా. ఇప్పడు డెంగీ జ్వరాల తో బెంబేలెత్తి పోతున్నారు. ప్రభుత్వాలు మారినా మా తల రాతలు మారడం లేదు అని తమను తాము నిందించుకోవడం మినహా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ కుటుంబాల మొర ఎవరు ఆలకిస్తారు. వారి గోడు ఈ నాయకుడు పట్టించుకుంటారు. ఇదే సమస్య పై అనేక మార్లు అధికారుల చుట్టూ ప్రదిక్షణలు చేసినా ఫలితం మాత్రం శూన్యం. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి ఆ కాలనీ అభివృద్ధి చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

రిపోర్టర్
సత్య.
 మైలవరం