పెద్దాపురం డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ రవీంద్ర నాథ్ బాబు

TV77తెలుగు పెద్దాపురం: పెద్దాపురం డీఎస్సీ ఆఫీసులో రికార్డ్స్ తనిఖీ చేసిన తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు మీడియాతో మాట్లాడుతూ,అన్ని రికార్డులు సరైన రీతిలో అన్నీ అప్డేట్ గా ఉన్నాయని సంతృప్తి చెందినట్లు ఎస్ పి రవీంద్ర నాథ్ బాబు తెలిపారు అలాగే గంజాయి రవాణా చేసేందుకు అవకాశం ఉన్నందున గంజాయ్ మాఫియాకు చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతున్నామన్నారు.ట్రాఫిక్ సమస్యలు ,రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పెద్దాపురం డి.ఎస్.పి అరిటాకులు శ్రీనివాసరావు సీఐ జయకుమార్ . ఎస్సై రావూరి మురళీమోహన్ దితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.