మండల అభివృద్ధికై పాల అడుగు
iraila 19, 2021
మండల అభివృద్ధికై
పాల "" అడుగు ""....!!!
నేడు వెలువడనున్న ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల ఫలితాలు...!!
నాటి ఎన్నికల్లో టిడిపి అభ్యర్ధులు పెద్దగా ఆసక్తి చూపకపోవడం తో ఏక పక్షంగా జరిగిన ఎన్నికలు....!!!
ఎంపిటిసి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్దులు విజయబావుటా ఎగరేస్తారని అంచనా వేస్తున్న వైసీపీ శ్రేణులు....!!!
ఇబ్రహీంపట్నం మండలం వైసీపీ వశం అయితే ఎంపిపి గా పాలడుగు జ్యోత్న్స...??
గుంటుపల్లి రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయం లిఖించడానికి సిద్ధమైన పాలడుగు దుర్గా ప్రసాద్....!!
TV77తెలుగు ఇబ్రహీంపట్నం:
ఎడతెగని ఉత్కంఠకు తెరపడింది.ఎంపిటిసి, జడ్పీటిసి ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు విడుదల కానున్నాయి. ఎన్నికల్లో ప్రత్యర్థుల నామ మాత్రం పోటీ ఉండటం తో అధికార వైసీపీ విజయ అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.ఇబ్రహీంపట్నం మండలం లోని మొత్తం 10 గ్రామాలకు గాను 11 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరగగా మొత్తం స్థానాలు వైసీపీ గెలుస్తుందని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో లో మండల పీఠం దాదాపుగా వైసీపీ వశం అవుతుందనే అంచనాలు ఉన్నాయి.అనుకుట్టుగా ఫలితాలు ఉంటే మండల పీఠాన్ని పాలడుగు జ్యోత్న్స దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.ఇప్పటివరకు గుంటుపల్లి గ్రామ అభివృద్ధిని భుజనకేసుకున్న పాలడుగు కుటుంబం ఇక నుండి ఇబ్రహీంపట్నం మండల గ్రామాలకు తన మార్క్ పాలన పరిచయం చేసేందుకు పాలడుగు దంపతులు సిద్ధం అవుతున్నారు.మొత్తం మీద ఇబ్రహీంపట్నం మండల రాజకీయ చరిత్ర లో పాలడుగు నూతన అధ్యాయం లిఖించడం ఖాయం అంటూ పాలడుగు సైన్యం బలంగా విశ్వసిస్తోంది.ఇప్పటికే జరిగిన పంచాయితీ ఎన్నికల్లో టిడిపి కంచుకోటలను బద్దలు కొట్టిన వైసీపీ గుంటుపల్లి రాజకీయాలలో మరో హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయం అంటూ వైసీపీ శ్రేణులు నూతనోత్సాహం తో ఉన్నారు...
సత్య..
రిపోర్టర్
మైలవరం