గిరిజన విద్యార్థుల శాపమా అధికారుల నిర్లక్ష్యమా


 

TV77తెలుగు రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం, దేవీపట్నం మండలం ఇందుకూరు పంచాయతీ చిన్న భీంపల్లి గ్రామంలోని విద్యార్థులను వారి తల్లిదండ్రులు పాఠశాలకు పంపాలంటే భయ బ్రాంతులకు గురవుతున్నారు. వివరలలోకి వెళితే చిన్న భీంపల్లి గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా "కోయ ఎయిడెడ్ పాఠశాల " ఉండేది తరువాత మండల ప్రాథమిక పాఠశాలగా అది గుర్తింపు పొందింది. అయితే పాఠశాలకు స్థలం లేక పాఠశాల లేక చిన్న భీంపల్లి రామాలయం వద్ద పది సంవత్సరాలుగా పిల్లలకు తరగతులు బోదిస్తువొచ్చారు. పాఠశాలకు కావలసిన స్థలాన్ని అక్కడి గ్రామస్థులు ఉచితంగానే ఇచ్చారు అయినప్పటికీ అక్కడ ఒక పాఠశాల గాని సరైన వసతులు గాని అధికారులు ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. గ్రామస్థులే చివరకు చిన్న పా కను ఆ స్థలములో ఏర్పాటు చేసారు అక్కడ ఆవరణం అంతా మురికి నిల్వ నీరు, గడ్డి, ఉంది పాములు కూడా తిరుగుతూ ఉంటాయి.గ్రామస్థులు ఎన్ని సార్లు అధికారులు చుట్టూ తిరిగిన ప్రయోజనం కనిపించలేదు.MEO ని, ప్రాజెక్ట్ అధికారి గారిని, DEO ని కలిసిన మా సమస్య కు పరిస్కారం లభించలేదని తమ బాధని వెల్లడించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే తమ పిల్లలను బడికి పంపమని విద్యార్థుల తల్లిదండ్రులు తెలియజేసారు. కరోనా థర్డ్ వెవ్ పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందనే హెచ్చిరికల మధ్య అసలు పాఠశాల అందులో వసతులు లేని బడికి పంపి ఇబ్బుందులకు మేము గురికాలేమని వారు తెలియజేసారు. ఇప్పటికైనా అధికారులు పాఠశాల బిల్డింగ్ కట్టి సరైన వసతులు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని లేకుంటే ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా అనేక పనులు చేపడుతున్న మా గ్రామానికే ఎందుకు ఇలా జరుగుతుందో అని గ్రామస్థులు అధికారులు ఎందుకు మా పాఠశాల పట్ల,గ్రామం పట్ల నిర్లక్ష్యం చూపిస్తున్నారో అని ఇప్పటికైనా ఈ సమస్యకు పరిస్కారం చూపించాలని కోరుతున్నారు.