ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే వసంత ఫోకస్

TV77తెలుగు కొండపల్లి:

ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే వసంత ఫోకస్...!! 
 
కొండపల్లి , ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ ను క్షేత్ర స్థాయి పరిశీలన చేయనున్న ఎమ్మెల్యే....!! 
 
ప్రజలు పడుతున్న ఇబ్బందులు నేరుగా అడిగి తెలుసుకునే ప్రయత్నం....!! 
 
ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రణాళిక ప్రకారం విది విధానాల రూపకల్పన....!!
 
కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న ప్రజా సమస్యలపై మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ఫోకస్ పెట్టినట్లు ఎమ్మెల్యే కార్యాలయం ద్వారా తెలిసింది.. కొండపల్లి , ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో ప్రధాన సమస్య గా ఉన్న డ్రైనేజీ వ్యవస్థ పై దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపెందుకు సిద్ధం అవుతున్నారు... కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పారిశుధ్యం అమలు, డ్రైనేజీ వ్యవస్థ , దోమల నివారణ వంటి ప్రధాన సమస్యలపై అధికారులు మార్గ దర్శకాలు జారీ చేయనున్నారు... చేపట్టాల్సిన డ్రైనేజీ నిర్మాణ పనులు పై క్షేత్ర స్థాయి పర్యటన చేసి ప్రజా సమస్యలపై నేరుగా ప్రజలను అడిగి తెలుసుకోనున్నారు... మున్సిపాలిటీ అధికారుల కు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసి ప్రజా సమస్యలకు చెక్ పెట్టేందుకు ప్రణాళిక ప్రకారం పని చేయనున్నట్లు తెలిపారు.. 
 సత్య... 
రిపోర్టర్ మైలవరం